: కాంగ్రెస్ లోనే ఉంటా... కానీ, ఇప్పుడు పోటీ చేయలేను: మాజీ ఎంపీ వివేక్


తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ జి.వివేక్ తన మనసులోని మాటను స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే, టీఎస్ మంత్రి కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో... ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిథ్యం వహించిన వరంగల్ లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో, గత ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన వివేక్ ను వరంగల్ నుంచి పోటీ చేయాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం కోరినట్టు సమాచారం. అయితే, తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ, కీలక పాత్ర పోషిస్తానని... ప్రస్తుతానికైతే తనకు పోటీ చేయాలన్న ఆలోచన లేదని వివేక్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో, గతంలో ఇక్కడ ఓడిన రాజయ్యనే మళ్లీ బరిలోకి దింపాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు, వివేక్ టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News