: అమ్మా, నాన్న ఎక్కడ?...ఇంటికి పంపండి, చదువుకోవాలి:‘ధవళేశ్వరం’ మృత్యుంజయుడు


తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వ్యాన్ బోల్తా ఘటనలో మొత్తం కుటుంబ సభ్యులను కోల్పోయిన పదమూడేళ్ల కిరణ్ ప్రస్తుతం విశాఖలోని సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు చనిపోయారన్న విషయం తెలియని అతడు మాట్లాడుతున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టిస్తోంది. ‘‘నేను పోలీసు కావాలన్నది అమ్మా, నాన్న కోరిక. వాళ్ల కోరిక నెరవేర్చడానికి ఆటలు కూడా ఆడకుండా రోజంతా చదువుకుంటానని అమ్మకు చెప్పా. క్వార్టర్లీ పరీక్షల్లో ఏ గ్రేడ్ వచ్చింది. అది తప్ప మిగిలిన పరీక్షలన్నింటిలోనూ ఏ ప్లస్ గ్రేడే. నన్ను ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉంచితే, చవువుకునే టైమ్ వేస్టవుతుంది. త్వరగా ఇంటికి పంపేయండి’’ అని అతడు ఆస్పత్రి సిబ్బందికి పదే పదే చెబుతున్నాడు. ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయిన విషయాన్ని బంధువులు అతడికి చెప్పలేదు. దీంతో ‘‘అమ్మా, నాన్న ఎక్కడ? ఇంటికెళదాం పదండి’’ అంటూ అతడు తన బంధువులను క్షణానికోమారు పోరుతున్నాడట. దీంతో అతడికి వాస్తవం చెప్పలేక, అతడిని అనునయించలేక అతడి బంధువులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News