: జర్నలిస్టును కొట్టి, బైక్ కు కట్టేసి ఈడ్చుకెళ్లారు!
ఒక భూమి లావాదేవీకి సంబంధించిన వార్త రాశాడన్న అక్కసుతో సదురు జర్నలిస్టును పిలిచి మరీ దారుణంగా కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదర్ ఖాన్ అనే విలేకరికి సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. ఓ దొంగతనానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని అతడిని రక్షించేందుకు రావాలని ఫోన్ లో ఆనంద్ అనే వ్యక్తి కోరాడు. దీంతో హైదర్ వెళ్లడంతో, నలుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తుపాకీతో బెదిరించారు. బైక్ కు కట్టేసి 100 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకుపోయారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. దాడికి సంబంధించి నలుగురిపై కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. ఇటీవల ఇదే జిల్లాలో జగేంద్ర సింగ్ అనే విలేకరికి నిప్పంటించిన సంగతి తెలిసిందే.