: అభివృద్ధి రూటు మారకుంటే...హిస్టరీ రిపీట్ అవుతుంది: టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్య
అభివృద్ధి విషయంలో గతంలో జరిగిన పొరపాటు పునరావృతమైతే, అందుకనుగుణంగానే చరిత్ర కూడా రిపీట్ కావడం ఖాయమని టీడీపీ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్య చేశారు. విశాఖలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నేతలతో నిన్న జరిగిన సమావేశానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్నే అభివృద్ధి చేశారు. ఆర్థిక రాజధానిగా హైదరాబాద్ అవతరించిన అనంతరం సీమాంధ్రులను గెంటేశారు. ఇప్పుడు కూడా వెనుకబడిన జిల్లాలను విస్మరించి రాజధాని ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే, చరిత్ర రిపీట్ అవుతుంది. నాడు పాలకులు చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారు’ అంటూ ఆయన తన పార్టీ అధినేతకే హెచ్చరికలు జారీ చేశారు.