: కేసీఆర్ కూడా గల్ఫ్ ఏజెంట్ గా పనిచేశారు... మాజీ ఎంపీ మధు యాష్కీ వ్యాఖ్య
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్వ రంగంలో ఏం పని చేశారన్న అంశంపై అంతగా చర్చ జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన తన అభిమాన నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశంపార్టీ పేరిట రాజకీయ పార్టీ పెట్టడంతో అందులో చేరిపోయారు. ఇక ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే, పూర్వ రంగంలో కేసీఆర్ గల్ఫ్ ఏజెంట్ గా పనిచేశారు. దీంతో అక్రమ వలసలు, వాటి విధానాల గురించి ఆయనకు బాగానే తెలిసి ఉంటుందట. నిజామాబాదు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత మధు యాష్కీ గౌడ్ నిన్న దుబాయిలో ఈ విషయాన్ని చెప్పారు.