: ఆ సినిమాలో నటించడానికి హర్భజనే స్పూర్తి: ప్రియురాలు గీతా బాస్రా
హర్భజన్ కు ఆటపైగల మమకారం చూసి స్ఫూర్తి పొంది 'సెకెండ్ హ్యాండ్ హజ్బెండ్' సినిమాలో నటించినట్టు హర్భజన్ సింగ్ ప్రియురాలు గీతా బాస్రా తెలిపింది. 'సెకెండ్ హ్యాండ్ హజ్బెండ్' సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, హర్భజన్ కు క్రికెట్ అంటే ఎనలేని మక్కువ అని చెప్పింది. ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండడం హర్భజన్ ప్రత్యేకత అని చెప్పింది. అలాంటి మనస్తత్వమే ఉన్న తాను కూడా విరామం తరువాత నటించాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. ఈ ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నారట కదా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ, అలాంటి పుకార్లు విన్నప్పుడు బాధగా ఉంటుందని చెప్పింది. పెళ్లికి సంబంధించిన విషయంలో దాచడానికి ఏముంటుందని గీతా బాస్రా ఎదురు ప్రశ్నించింది. పెళ్లి సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ చెబుతానని తెలిపింది.