: అంబేద్కర్ నివసించిన ఇంటిని కొనుగోలు చేయనున్న మహారాష్ట్ర


లండన్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ నివసించిన ఇంటిని మహారాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. గతేడాది నాలుగు మిలియన్ పౌండ్ల ధర నిర్ణయించి, ఈ ఇంటిని లండన్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ క్రమంలో లండన్ లోని ప్రభుత్వాధికారులతో మహారాష్ట్ర సర్కారు సంప్రదింపులు జరుపుతోంది. కాగా, అంబేద్కర్ లండన్ లోని కింగ్ హెన్నీ రోడ్ లోని ఇంట్లో 1921-22 ప్రాంతంలో నివాసం ఉంటూ 'లండన్ ఆఫ్ ఎకనామిక్స్'లో చదువుకున్నారు.

  • Loading...

More Telugu News