: ఐసీసీకి కోహ్లీ కొత్త సూచన
ఐసీసీకి టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త సూచన చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక వన్డే డ్రాగా ముగిసిన అనంతరం కోహ్లి మాట్లాడుతూ, వన్డే మ్యాచ్ లకు ఉన్నట్టుగానే టెస్ట్ లకూ రిజర్వు డే ఉంటే బాగుంటుందని కొత్త సూచన చేశాడు. టెస్టు ఫార్మెట్ కు కూడా రిజర్వు డే ఉండాలన్న దానిపై చర్చ జరగాలన్నాడు. 250 పైగా ఓవర్ల పాటు సాగిన టెస్టు మ్యాచ్ ఈరోజు డ్రాగా ముగిసింది. మ్యాచ్ పరిస్థితిని బట్టి ఫలితం కోసం మరొక్క రోజు పొడిగించే అవకాశం పరిశీలించాలని కోహ్లీ కోరాడు. అయితే దీనిపై ఎలాంటి చర్చలు జరుగుతాయో తనకు తెలియదని కోహ్లీ పేర్కొన్నాడు. కాగా, గెలవాల్సిన మ్యాచ్ డ్రాగా ముగియడంతో కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని పలువురు పేర్కొంటున్నారు.