: నోటు లేకుండా కేసీఆర్ ఒక్క సీటైనా గెలిచాడా?: జేసీ సంచలన వ్యాఖ్యలు
నోటు లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క సీటైనా గెలిచాడా? అంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురంలో నోటుకు ఓటు వివాదంపై ఆయన మాట్లాడుతూ, సర్పంచ్ నుంచి ప్రధాని వరకు ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయని వారెవరు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తప్పు చేయలేదని గ్రామాల్లో ప్రజలు నమ్ముతున్నారని ఆయన చెప్పారు. నదులను అనుసంధానం చేస్తేనే జిల్లాల తాగు, సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.