: గ్రేటర్ కాంగ్రెస్ లో ఆధిప్యత పోరు...దానం, నిరంజన్ మధ్య వాగ్వాదం
గ్రేటర్ హైదరాబాదు కాంగ్రెస్ లో అంతర్గత ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో నేడు గాంధీ భవన్ లో జరిగిన నగర కాంగ్రెస్ కమిటీ భేటీలో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి దానం నాగేందర్, గ్రేటర్ హైదరాబాదు కాంగ్రెస్ నేత నిరంజన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దానం పార్టీని పటిష్టపరిచేందుకు సమావేశాలు నిర్వహించడం లేదని నిరంజన్ టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై మండిపడిన దానం, 'ఆ సమావేశాలేవో మీరే పెట్టుకోండి' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దానం, నిరంజన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నట్టు సమాచారం.