: బాలయ్యకు ధన్యవాదాలు: రాజమౌళి
తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో బాహుబలి ఆడియో వేడుక ముగించి హైదరాబాదు వచ్చిన రాజమౌళి, ఆడియో వేడుకలో ధన్యవాదాలు చెప్పడం మరిచిన వారికి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. బాహుబలి షూటింగ్ చేసుకునేందుకు పర్మిషన్లు ఇప్పించిన నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పడం మరిచానని తెలిపారు. ఆయన సహకారం మరువలేనని అన్నారు. అలాగే తన గురువు రాఘవేంద్రరావుగారికి కూడా ధన్యవాదాలు చెప్పడం మరచానని ఆయన పేర్కొన్నారు. బాహుబలి నిర్మాతలు ప్రసాద్, శోభులకు ధన్యవాదాలు తెలిపారు. వారు లేకపోతే ఈ ప్రాజెక్టు ఇంత గొప్పగా వచ్చేది కాదని ఆయన ట్వీట్ చేశారు.