: బాబుది ఏపీలో భూమిపూజ, తెలంగాణలో ధనపూజ: అంబటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీలో భూమి పూజ, తెలంగాణలో ధనపూజ చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జాతీయ మీడియాలో రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాప్ చేయలేదని బాబు అన్నారని, ఆడియో టేపుల్లో ఉన్న గొంత తనదేనని చెప్పేందుకు బాబుకు ధైర్యం సరిపోవడం లేదని అన్నారు. బాబు నేరం రుజువు చేసేందుకు లైడిటెక్టర్ పరీక్ష అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజల గౌరవం కాపాడేందుకు బాబు విచారణకు అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆడియో టేపుల వ్యవహారం బయటపడేంతవరకు సెక్షన్ 8 ఎందుకు గుర్తు రాలేదని ఆయన టీడీపీ నేతలను ప్రశ్నించారు.