: భోపాల్ గ్యాస్ నిందితుడా... ఖత్రోచీనా... అంత బాధపడుతారెందుకు?: అమిత్ షా
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా జారీకి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సిఫారసు చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, భోపాల్ గ్యాస్ కేసులో నిందితుడు ఆండర్సన్, బోఫోర్స్ కుంభకోణానికి పాల్పడ్డ ఖత్రోచీకి వీసా జారీ చేస్తున్నట్టు కాంగ్రెస్ భావిస్తోందని, అది సరికాదని, కేంద్ర మంత్రి సిఫారసు చేసినది భారతీయుడైన లలిత్ మోదీకి అని కాంగ్రెస్ గుర్తు చేసుకోవాలని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అనారోగ్యంతో భార్య బాధపడుతుండడంతో వీసా జారీకి కేంద్ర మంత్రి సిఫారసు చేయడం మానవత్వమున్న మనిషిగా స్పందించడమే తప్ప, అందులో ఎలాంటి స్వలాభాపేక్ష లేదని ఆయన స్పష్టం చేశారు. విపక్షాలు కోరుతున్నట్టు సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహకరించాలని మాత్రమే సుష్మా కోరారని ఆయన వెల్లడించారు.