: సుష్మా స్వరాజ్ రాజీనామాపై పుకార్ల షికారు!


కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామాపై దేశ రాజధాని ఢిల్లీలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా మంజూరు చేయాలని సుష్మా ఇమ్మిగ్రేషన్ అధికారులకు సిఫారసు చేశారు. మంత్రిగారి సిఫారసు వ్యవహారం కాస్తా బట్టబయలు కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఒంటికాలిపై లేచింది. సుష్మా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. విషయం తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా సుష్మా తీరుపై అసహనం వ్యక్తం చేశారట. ఈ విషయం తెలుసుకున్న సుష్మా వెనువెంటనే ప్రధానితో మాట్లాడారట. ఏ పరిస్థితుల్లో తాను ఆ నిర్ణయం తీసుకున్నానన్న విషయంపై ఆమె ప్రధానికి సవివరంగా తెలిపారట.

  • Loading...

More Telugu News