: ఈటెలకు పరామర్శల వెల్లువ... ఫోన్ చేసిన గవర్నర్, వెంకయ్య


కారు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోలుకుంటున్నారు. నిన్న ఆస్పత్రిలో చేరిన వెంటనే ఆయన సహచర మంత్రులు పరామర్శకు బారులు తీరారు. తాజాగా నేటి ఉదయం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈటెలకు ఫోన్ చేసి పలుకరించారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇక తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నేరుగా ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు.

  • Loading...

More Telugu News