: కేసీఆర్ పై విరుచుకుపడిన టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ!


ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర దూషణలకు దిగుతున్న ఈ రెండు పార్టీల నేతలు పలు సందర్భాల్లో కట్టుతప్పుతున్నారు. తెలంగాణ సీఎం తనదైన శైలిలో మాటల దాడికి దిగుతుంటే, టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నిన్న కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, కేసీఆర్ ను కోతితో పోల్చారు. ఓటుకు నోటు వ్యవహారంలో కేసీఆర్ వైఖరి వల్ల రాజకీయ గందరగోళం నెలకొందని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కేసు విషయంలో కేసీఆర్ ఫిర్యాదుదారుగానే కాక విచారణాధికారిగా, చివరకు జడ్జిగానూ మారిపోయారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనకు నచ్చనివారిపై కక్షసాధింపు చర్యలకు కేసీఆర్ తెరతీస్తున్నారని ఆక్షేపించారు. అసలే కోతి.. ఆపై కల్లు తాగిన చందంగా కేసీఆర్ తీరు కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News