: ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు: ప్రభాస్


బాహుబలి ఆడియో వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ... ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదని అన్నాడు. తమ కెరీర్లో మరుపురాని చిత్రంగా నిలిచిపోతుందని తెలిపాడు. బాహుబలి కోసం ఎంతో శ్రమించామని చెప్పాడు. ఈ సినిమా జూలై 10న విడుదల అవుతుందని దర్శకుడు రాజమౌళిని అడిగిన అనంతరం ప్రకటించాడు. అంతకుముందు, రాజమౌళి ఓ ప్రత్యేకమైన వ్యక్తి అని ప్రభాస్ కితాబిచ్చాడు. సింహాద్రి వంటి భారీ హిట్ కొట్టిన తర్వాత కూడా తనకోసం వెయిట్ చేయడంతో ఈయన మామూలు మనిషి కాదనుకున్నానని చెప్పాడు.

  • Loading...

More Telugu News