: రమ తోడు లేకపోతే ఇన్ని సినిమాలు తీయగలిగేవాణ్ని కాదు: జక్కన్న


ఎప్పుడైనా ఇంట్లో మద్దతు ఉన్నప్పుడే ఎంత కష్టమైనా ఓర్చుకోగలిగే శక్తి వస్తుందని రాజమౌళి అన్నారు. తన విజయం వెనుక భార్య రమ పాత్ర ఎంతో ఉందని తెలిపారు. 'నువ్వు చేయి, నీ వెనుక నేను ఉంటా' అని ఆమె ధైర్యం ఇచ్చేదని, అందుకే ఇన్ని సినిమాలు తీయగలిగానని వివరించారు. ఇక, అన్న కీరవాణి సంగీతం తన సినిమాలకు ఎంతగానో తోడ్పడిందని తెలిపారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. తప్పు చేస్తే వెంటనే చెబుతారని, అలాంటి మ్యూజిక్ డైరక్టర్ ప్రపంచంలో ఎక్కడా దొరకరని, కానీ, తనకు దొరికారని తెలిపారు.

  • Loading...

More Telugu News