: శివగామి క్యారెక్టరే మాకు ఎనర్జీ: రాజమౌళి


బాహుబలి ఆడియో వేడుకలో దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. సినిమా షూటింగ్ సందర్భంగా ఒక్కోసారి నిస్పృహకు లోనైనప్పుడు తనకు, యూనిట్ కు ఎనర్జీ ఇచ్చింది శివగామి క్యారెక్టరే అని తెలిపారు. శివగామి పాత్రధారి రమ్యకృష్ణ డైలాగులు చెబుతున్నప్పుడు ఉత్సాహం ఉప్పొంగేదని తెలిపారు. ఇక, సత్యరాజ్ గురించి చెబుతూ... ఎన్నో సినిమాలు చేసిన ఆయన ప్రతిరోజు షూటింగ్ ముగిసిన తర్వాత తనకు చెప్పి వెళ్లేవారని, ఓ దర్శకుడికి అంత విలువ ఇవ్వడం తనను ఆకట్టుకుందని చెప్పారు. నాజర్ కూడా అంకితభావం ప్రదర్శించారని, ఆయనతో ఉంటే ఓ సహధ్యాయితో ఉన్నట్టు ఉంటుందని, ఎప్పుడూ సినిమా విషయాలే మాట్లాడతాడని తెలిపారు. ఇక, తమన్నా, అనుష్కలపైనా ప్రశంసల జల్లు కురిపించారు. వారు తమతమ పాత్రల్లో లీనమైపోయారని చెప్పారు.

  • Loading...

More Telugu News