: అమిత్ షాపై బీహార్ ముఖ్యమంత్రి సెటైర్


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ సెటైర్ వేశారు. ఈ నెల 21న వరల్డ్ యోగా డే సందర్భంగా పాట్నాలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటున్నారు. దీనిపై నితీశ్ వ్యాఖ్యానిస్తూ... 'నీదసలు యోగాకు సరిపోయే శరీరమేనా?' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. బీజేపీ ప్రచారం కోసమే ఈ యోగా డే కార్యక్రమాలు నిర్వహిస్తోందని విమర్శించారు. తాను ఎన్నో ఏళ్లుగా ఇంట్లోనే యోగా చేసుకుంటున్నానని తెలిపారు. పబ్లిసిటీ కోసం ఎప్పుడూ యోగా చేయలేదని అన్నారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వేసిన ప్రచార ఎత్తుగడ ఇది అని నితీశ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News