: ఇది దేవుడు రాసిన కథ: రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్


బాహుబలి ఆడియో వేడుకలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తనలోని రచయితను వేదికపై ఆవిష్కరించారు. యాంకర్ సుమ ఓ అబద్ధం చెప్పిందని అన్నారు. బాహుబలి కథను తాను రాయలేదని సరదాగా అన్నారు. ఇది దేవుడు రాసిన కథ అని చమత్కరించారు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ దేవుడే సృష్టించాడని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో బాహుబలి అనే గొప్ప చిత్రంతో ప్రపంచఖ్యాతి పొందండని ఆశీర్వదించి పంపాడని తెలిపారు. సెంథిల్ కుమార్, పీటర్ హెయిన్స్, రమా రాజమౌళి... ఇలా అందరినీ దేవుడే పంపాడని అన్నారు. అర్జునుడి వంటి రూపం, భీముని బలం, అభిమన్యుడి పౌరుషం, రాముని గుణం, కృష్ణుని వంటి సమ్మోహనంతో బాహుబలిని సృష్టించాడని అతడే ప్రభాస్ అని వివరించారు.

  • Loading...

More Telugu News