: 'టీచ్ ఫర్ ఛేంజ్' అంటున్న మోహన్ బాబు తనయ
నటుడు మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి విజయవాడలోని సమాన ఇన్ స్టిట్యూట్ లో 'టీచ్ ఫర్ ఛేంజ్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల నిపుణులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన తరగతులు నిర్వహించడమే ఈ 'టీచ్ ఫర్ ఛేంజ్' ముఖ్యోద్దేశం. తొలి విడతగా 10 గవర్నమెంట్ స్కూళ్లను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ... హైదరాబాదులో 100కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 'టీచ్ ఫర్ ఛేంజ్' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తారు.