: రేవంత్ ను ఇరికించేందుకు కేసీఆర్ దళితులను పావులుగా వాడుకున్నారు: జూపూడి


టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై మండిపడ్డారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఇరికించేందుకు దళితులను పావులుగా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడైన సెబాస్టియన్ ఫోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఉపయోగిస్తున్న భాషను జూపూడి తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ తన స్థాయికి తగిన భాష మాట్లాడడం లేదని అన్నారు. ధర్నా చేసే కార్యకర్త ఎలాంటి భాష వాడతాడో, కేసీఆర్ కూడా అలాంటి భాషే మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ సర్కారు మెడకు చుట్టుకుంటుందని తెలిపారు. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ఉదంతం గురించి కేసీఆర్ తెలుసుకుంటే మంచిదని జూపూడి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News