: తన జీవితమంతా ఆమేనంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు


అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, తన సతీమణి హిల్లరీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాను కష్టాల్లో ఉన్న సమయంలో వెన్నంటి నిలిచిందని, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి నడిపించిందని పొగిడారు. భార్య హిల్లరీ కంటే తనకు మరేదీ ఎక్కువ కాదని అన్నారు. క్లింటన్ దంపతుల వైవాహిక జీవితంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బిల్, గడచిన 40 ఏళ్లుగా హిల్లరీ తన వెంట ఉండి సాయపడిందని, కెరీర్ లో విజయం సాధించేందుకు ప్రోత్సహించిందని అన్నారు. తామిద్దరమూ పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకుంటామని, అందువల్లే తమ మధ్య ప్రేమ మరింతగా బలపడిందని వివరించారు. కాగా, హిల్లరీ తదుపరి యూఎస్ అధ్యక్ష పదవికి పోటీ పడాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, బిల్ తన పూర్వ అనుభవాన్ని ఉపయోగించి ఆమెకు సహాయ పడాలని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News