: హైదరాబాదులో సెటిలర్స్ కు ఎలాంటి ఇబ్బంది లేదు... టీ మంత్రి తలసాని స్పష్టీకరణ


హైదరాబాదులో సెటిలర్స్ కు ఎలాంటి ఇబ్బంది లేదని, వారంతా నిశ్చింతగా ఉండొచ్చని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన తలసాని, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాదులో సీమాంధ్రులకు భద్రత లేకుండా పోయిందని ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ కూడా రాశారు. దీనిపై తలసాని ఘాటుగా స్పందించారు. తాను తప్పు చేసి, ఆ తప్పును చంద్రబాబు ఆంధ్రా ప్రజలకు అంటగడుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారం ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదం కాదని తలసాని చెప్పారు. తప్పు చేసి దొరికిపోయిన చంద్రబాబు ఒత్తిడిలో కూరుకుపోయి ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు మాటలను హైదరాబాదులోని సెటిలర్స్ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోరాదని కూడా తలసాని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News