: నెస్లేతో పాటు బ్రిటానియా, హల్దీరామ్, ఎంటీఆర్ సంస్థలపై యూఎస్ కొరడా!


మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై అమెరికా కొరడా ఝళిపిస్తోంది. గడచిన సంవత్సరం వ్యవధిలో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటర్ విభాగం పలు భారత కంపెనీలకు చెందిన 2,100 బ్యాచ్ ల ప్రొడక్టులను దేశంలోకి అడుగు పెట్టనీయలేదు. నెస్లేతో పాటు బ్రిటానియా, హల్దీరామ్, ఎంటీఆర్, హెంజ్ ఇండియా, హిందుస్థాన్ యూనీలివర్ తదితర కంపెనీల ఆహార, సౌందర్య, ఆరోగ్య పానీయాల విభాగాల్లోని ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని యూఎస్ఎఫ్ డీఏ ఆరోపిస్తూ, వాటిపై నిషేధాన్ని విధించింది. యూఎస్ఎఫ్ డీఏ వెల్లడించిన అధికార సమాచారం మేరకు ఇవన్నీ అపరిశుభ్ర వాతావరణంలో తయారయ్యాయని, క్రిమి సంహారకాలు పరిమితికి మించి ఉన్నాయని తెలుస్తోంది. కాగా, కంపెనీలు మాత్రం ఇవి అమెరికా మార్కెట్ కోసం తయారు చేసినవి కాదని, పొరపాటున ఆ బ్యాచ్ లు ఎగుమతి అయ్యాయని చెబుతున్నాయి. అంటే, భారత మార్కెట్ అయితే ఎలాగైనా తయారు చేయవచ్చని కంపెనీలు భావిస్తున్నట్టా?

  • Loading...

More Telugu News