: కంచన్ బాగ్ బీడీఎల్ లో పేలుడు...ఐదుగురికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం


తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి నుంచి ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. రాత్రి ధవళేశ్వరం వద్ద వ్యాన్ బోల్తా పడగా, నేటి ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో పేలుడు సంభవించింది. తాజాగా కొద్దిసేపటి క్రితం హైదరాబాదు కంచన్ బాగ్ లోని బీడీఎల్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు క్షతగాత్రులను డీఆర్ డీఓలో ని అపోలో ఆస్పత్రికి తరలించారు. బీడీఎల్ ఆవరణలో స్క్రాప్ ను తగులబెడుతుండగా పేలుడు సంభవించిందని ప్రాథమిక సమాచారం.

  • Loading...

More Telugu News