: 50 మీటర్ల పై నుంచి పడటంతోనే అధిక ప్రాణ నష్టం...మృతులకు రూ.2 లక్షల పరిహారం: చినరాజప్ప


తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వ్యాన్ బోల్తా ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ యువరాజుతో కలిసి ఘటనాస్థలిని పరిశీలించిన చినరాజప్ప, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ బ్యారేజీ వంతెన పై నుంచి దాదాపు 50 మీటర్ల లోతుకు వాహనం పడినందువల్లే ప్రాణనష్టం అధికంగా ఉందని ఆయన చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని వారి కుటుంబాలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News