: 10 కోట్ల మందికి పైగా చేరారు, ఆ రెండూ సూపర్ హిట్!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సామాజిక భద్రతా పథకాలు, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్ బీవై) సూపర్ హిట్ అయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ స్కీముల్లో ఇప్పటివరకూ 10.17 కోట్ల మంది ప్రజలు చేరారని, దీంతో పాటు అటల్ పెన్షన్ యోజన కూడా విజయవంతమైందని తెలిపారు. కేవలం 33 రోజుల వ్యవధిలో స్కీముల్లో చేరిన వారి సంఖ్య 10 కోట్లను దాటిందని పేర్కొన్నారు. పెన్షన్ స్కీములో రెండు లక్షల మంది సభ్యత్వాన్ని పొందారని వివరించారు. ఈ స్కీములు విజయవంతం కావడంతో ప్రైవేటు బ్యాంకులు కూడా పాలసీలను విక్రయించేందుకు ముందుకు వచ్చి అనుమతులు కోరుతున్నాయని తెలిపారు.