: 6000 ఎంఎహెచ్ బ్యాటరీతో జియోనీ స్మార్ట్ ఫోన్... ఎలా వాడినా నాలుగు రోజులు దిగుల్లేదట!
స్మార్ట్ ఫోన్... ఎంత స్మార్ట్ గా అనిపించినా, బ్యాటరీ విషయంలో మాత్రం ఎవరికీ సంతృప్తినివ్వదు. ప్రతిరోజూ చార్జింగ్ పెట్టాల్సిందే. పవర్ బ్యాంకు వెంట ఉంచుకోవాల్సిందే. అయితే, ఈ కష్టాలకు స్వస్తి పలికేలా 6000 ఎంఎహెచ్ బ్యాటరీతో కూడిన 'మారథాన్ ఎం5'ను విడుదల చేయనున్నట్టు జియోనీ వెల్లడించింది. ఈ ఫోన్ బ్యాటరీ అన్ని రకాల యాప్స్ వాడుతున్నా 4 రోజుల పాటు నిలిచివుంటుందని సంస్థ చెబుతోంది. జూన్ 25 నుంచి చైనాలో అమ్మకాలు ప్రారంభిస్తామని, దీని ధర 2,299 యువాన్ (రూ. 23,000)లుగా ఉంటుందని తెలిపింది. 5 శాతం బ్యాటరీతో రెండున్నర రోజుల స్టాండ్ బై టైంను అందిస్తుందని వివరించింది. ఈ ఫోన్ ను పవర్ బ్యాంకుగా కూడా ఉపయోగించవచ్చని తెలిపింది. రెండు సిమ్ స్లాట్లూ 4జి ఎల్ టీఈ టెక్నాలజీకి సపోర్టిచ్చేలా తయారు చేసిన ఫోన్లో 16 గిగాబైట్ల ఇన్ బిల్ట్ స్టోరేజ్ సామర్థ్యం ఉందని పేర్కొంది.