: డ్రైవర్ నిద్ర మత్తే ధవళేశ్వరం దుర్ఘటనకు కారణం... 22 కు చేరిన మృతుల సంఖ్య
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద చోటుచేసుకున్న ఘోర ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తే కారణమని తెలుస్తోంది. తెల్లవారుజామున వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ నిద్ర మత్తుతో తూలిన కారణంగానే అదుపు తప్పిన వాహనం బ్యారేజీపై నుంచి గోదావరిలోకి బోల్తా పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదిలా ఉంటే, ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 22 కు చేరింది. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిలో ఓ బాలిక మరణించగా, 13 ఏళ్ల చిన్నారి బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక వీరంతా తిరుమల వెంకన్నను దర్శించుకుని తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.