: ధవళేశ్వరం బ్యారేజీ పై నుంచి వ్యాన్ బోల్తా... 21 మంది మృత్యువాత


ఏపీలో గతరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. తీర్థయాత్రలకు బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన 21 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. వివరాల్లోకెళితే... విజయవాడ నుంచి విశాఖ వైపు వెళుతున్న ఓ వ్యాన్ నిన్న రాత్రి తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ మీద అదుపుతప్పి గోదావరిలోకి పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో మొత్తం 23 మంది ఉండగా, వారిలో 21 మంది చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఏడుగురు చిన్నారులున్నారు. చనిపోయినవారంతా విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురానికి చెందిన వారుగా భావిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రస్తుతానికి ఎనిమిది మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకుని తిరిగివెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News