: వంటల్లో గసగసాలు వాడారని హోటల్ మేనేజర్లను అరెస్టు చేశారు
వంటల్లో రుచి కోసం గసగసాలు వినియోగిస్తున్నారన్న ఆరోపణలతో రెండు హోటల్ మేనేజర్లను అరెస్టు చేసిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని హన్ యాంగ్ జిల్లాలోని హోటళ్లలో భోజనం రుచిగా ఉండడానికి తోడు భోజన ప్రియులు అక్కడి హోటళ్లకు వెళ్లేందుకు మొగ్గుచూపడంతో అనుమానం వచ్చిన అధికారులు, గత మార్చిలో పలు హోటళ్లపై దాడులు నిర్వహించారు. పలు ఆహార పదార్థాలపై పరీక్షలు నిర్వహించారు. రెండు హోటళ్లలో గసగసాలు ఎక్కువ మోతాదులో వినియోగించారని పరీక్షల్లో తేలడంతో ఆ రెండు హోటళ్ల మేనేజర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వంటల్లో గసగసాల వాడకం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, గసగసాల్లో ఆల్కలాయిడ్లు తక్కువ మోతాదులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గసగసాల వాడకం వల్ల వంటకాల్లో రుచి పెరుగుతుందని, భోజన ప్రియులు పదేపదే ఆ హోటళ్లకు వస్తారని వారు పేర్కొంటున్నారు.