: తల నరుక్కుంటానని ప్రతి సభలోనూ చెప్పారు: కేసీఆర్ పై డీకే అరుణ మండిపాటు
కేసీఆర్ తన తల నరుక్కుంటానని ప్రతి సభలోనూ మాయమాటలు చెప్పారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే అరుణ విమర్శించారు. ఒకదానికొకటి పొంతనలేని మాటలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఉద్యమంలో ఆర్డీఎస్ ను బ్యారేజీగా నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మౌనం వహిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. ఇక, ఓటుకు నోటు కేసులో ఇద్దరు చంద్రులూ దొంగలేనని కేసీఆర్, చంద్రబాబులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.