: 'రవిశాస్త్రి సూపర్' అంటున్న ద్రావిడ్


బ్యాటింగ్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రిని ఆకాశానికెత్తేస్తున్నాడు. టీం డైరక్టర్ గా రవిశాస్త్రి ఇప్పటిదాకా అద్భుతంగా వ్యవహరించారని కితాబిచ్చాడు. తాత్కాలిక కోచ్ గా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన రవిశాస్త్రి పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపడితే అది జట్టుకు ఎంతో లాభిస్తుందని అన్నాడు. ఆయనకు ఆధునిక క్రికెట్ కు సంబంధించి అపార పరిజ్ఞానం ఉందన్నారు. ముఖ్యంగా, ఎంతో అనుభవం ఉందని, ఆటగాళ్లతో కలుపుగోలుగా ఉంటాడని ద్రావిడ్ వివరించాడు. టీమిండియా కోచ్ గా డంకన్ ఫ్లెచర్ నిష్క్రమణతో తదుపరి కోచ్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. గంగూలీ, ద్రావిడ్ లలో ఒకరికి ఈ బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించారు. అయితే, గంగూలీకి క్రికెట్ సలహా సంఘంలో చోటిచ్చిన బీసీసీఐ, ద్రావిడ్ ను అండర్-19, ఇండియా-ఎ జట్లకు కోచ్ గా నియమించింది. అటు, టీమిండియా డైరక్టర్ గా రవిశాస్త్రిని బంగ్లా టూర్ కు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో, టీమిండియా హెడ్ కోచ్ గా శాస్త్రిని నియమిస్తారంటూ కథనాలు వెలువడ్డాయి. ఇందుకోసం బోర్డు ఏడాదికి రూ.7 కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేసిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ద్రావిడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News