: ఏపీలో దోచుకుని తెలంగాణలో ధనపూజలు చేస్తున్నాడు: చంద్రబాబుపై అంబటి ధ్వజం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఏపీలో దోచుకున్న సొమ్ముతో తెలంగాణలో ధనపూజలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు పాపాత్ముడు కాబట్టే తెలంగాణలో దొరికిపోయాడని, ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. సీఎం పదవికి రాజీనామా చేస్తే, ఆ పదవిని బాలకృష్ణ గానీ, లోకేశ్ గానీ చేజిక్కించుకుంటారని చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.