: వైసీపీలో బొత్స చేరికతో జగన్ పై అలిగిన పార్టీ ఎమ్మెల్యే
బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరడంతో ఆ పార్టీలో అసంతృప్తి మొదలైంది. బొత్సను వ్యతిరేకిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అలిగారు. తన వ్యతిరేకి అయిన బొత్సను ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతో పార్టీ మారాలని అనుచరులు రంగారావుపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఆయన కూడా పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బొబ్బిలికోటలో కొద్దిసేపటి కిందట కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇది తెలిసిన వైసీపీ... సుజయకృష్ణకు సర్దిచెప్పాలని ఆ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామిని పంపింది. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది తెలియాల్సి ఉంది.