: ఎస్వీ యూనివర్శిటీలో 'బాహుబలి' ఆడియో వేడుక కోసం చురుగ్గా జరుగుతున్న ఏర్పాట్లు
భారీ బడ్జెట్ తో, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం తిరుపతిలో ఈ నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కార్యక్రమం మే 31న హైదరాబాదులో జరగాల్సి ఉండగా, అనుమతుల విషయమై వాయిదా వేశామని దర్శకుడు రాజమౌళి తెలిపారు. కాగా, తిరుపతిలో ఈ ఆడియో ఫంక్షన్ కు శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ ఆతిథ్యమిస్తోంది. వర్శిటీ మైదానంలో ఆడియో లాంచ్ కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం ఈవెంట్ మేనేజ్ మెంట్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.