: మత్తెక్కించే అందాలు ఎప్పటికీ మన్రోవే!


కొన్ని తరాల యువకులకు నిద్రలేని రాత్రులను ప్రసాదించినటువంటి ఒకనాటి శృంగార తార మార్లిన్‌ మన్రో మరణించి ఇప్పటికి యాభై సంవత్సరాలు గడుస్తోంది. అయినప్పటికీ.. అవయవ సౌష్టవం.. ఆత్యంత ఆకర్షణీయమైన వంపుసొంపులు కలిగిన ఆల్‌టైం సెలబ్రిటీలు ఎవరా అంటే.. అగ్రస్థానం మాత్రం ఆమెకే దక్కుతోంది. వర్తమానంలో హాలీవుడ్‌ నుంచి ప్రపంచాన్ని పిచ్చెక్కిస్తున్న అందగత్తెలు కెర్లీ బ్రూక్‌, క్రిస్టినా హెండ్రిక్స్‌, కిమ్‌ కర్దాషియన్‌ వంటి వారందరినీ మార్లిన్‌ మన్రో వెనక్కు నెట్టింది.

డెయిలీస్టార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్లిన్‌ మన్రోకు నలభై శాతం ఓట్లు లభించాయి. ప్రస్తుతం హాలీవుడ్‌ సెలబ్రిటీ కెర్లీ బ్రూక్‌ (33) టాప్‌ ఫైవ్‌లో చోటు సాధించింది.

  • Loading...

More Telugu News