: ప్రైవేటు బస్సుల్లాగా ప్రైవేటు రైళ్లూ రానున్నాయ్!
భారత రైల్వేలను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలన్న లక్ష్యంలో భాగంగా, నాటకీయ మార్పులను తెరపైకి తెస్తున్న ప్రభుత్వం, తాజాగా ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన ఓ కమిటీ ప్రైవేటు పాసింజర్ రైళ్లకు అనుమతించాలని సిఫార్సు చేసింది. నీతీ ఆయోగ్ సభ్యుడు వివేక్ దేవరాయ్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ ఈ మేరకు తన సిఫార్సులను కేంద్రానికి అందించింది. ప్రైవేటు కంపెనీలు వస్తే రైల్వేల్లోకి మరింత నిధులు వస్తాయని అంచనా వేసింది. ఈ సిఫార్సులను అమలు చేసేందుకే మోదీ సర్కారు మొగ్గు చూపవచ్చని అంచనా. ఈ సిఫార్సులు అమలైతే ప్రైవేటు సంస్థలు నడిపే రైళ్లు పట్టాలపై పరుగెత్తే రోజు ఎంతో దూరంలో ఉండబోదు.