: పార్టీలను, వ్యక్తులను తిట్టుకుంటూ కేసీఆర్ కాలం వెళ్లదీస్తున్నారు: ఎంపీ గుత్తా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును, కాంగ్రెస్ ను తిట్టుకుంటూ కేసీఆర్ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సన్నాసులైతే టీఆర్ఎస్ లో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. అసలు ఏపీ, తెలంగాణ సీఎంలిద్దరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతోనే సీఎం క్యాంప్ ఆఫీస్ కు తాగునీరు వచ్చిందన్న గుత్తా, పాలమూరు, డిండి ప్రాజెక్టులను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.