: మైక్రోసాఫ్ట్ ఉద్యోగం కాదని... పరిశోధనపై దృష్టిపెట్టిన ఐఐటీ టాపర్


సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్న రోజులివి. కానీ ఐఐటీ ఖరగ్ పూర్ లో బీటెక్ చదివి టాపర్ గా నిలిచిన శిఖర్ అనే విద్యార్థి మాత్రం మైక్రోసాఫ్ట్ లో వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకున్నాడు. తదనంతరం అదే కళాశాలలో పీహెచ్ డీ చేయాలని నిర్ణయించుకున్నాడు. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థి అయిన శిఖర్ 9.87 GPA మార్కులతో ఈ ఏడాది అత్యధిక స్థాయి గ్రాడ్యుయేట్ గా నిలిచాడు. దేశ రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ అందుకోనున్నాడు. అంతకుముందే క్యాంపస్ లో ఉద్యోగ ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో అత్యధిక జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగంకోసం పరిశోధనపై తనకున్న ప్యాషన్ ను పక్కన పెట్టకూడదనుకున్నాడు. ఈ క్రమంలో 'హార్డ్వేర్ భద్రతకు ఎంబెడెడ్ సిస్టమ్స్' అనే అంశంపై పరిశోధన చేయాలని శిఖర్ నిర్ణయించుకున్నాడు. "బీటెక్ తరువాత కార్పోరేట్ ఉద్యోగం చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. పరిశోధనలో, చదవులో నాకు చాలా ఆసక్తి ఉంది. అవే చదవాలనుకుంటున్నా. ఈ విషయంలో నాకు రెండో ఆలోచన లేదు. ఈ నిర్ణయం తీసుకోవడంలో నా ఉపాధ్యాయులు, కుటుంబం నాకు చాలా మద్దతిచ్చారు" అని శిఖర్ పీటీఐకి తెలిపాడు.

  • Loading...

More Telugu News