: నడిరోడ్డుపై బైఠాయించిన రాహుల్ ... ఢిల్లీ మున్సిపల్ సిబ్బంది ఆందోళనకు సంఘీభావం
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సర్కారుకు నానాటికీ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో వివాదం ముదిరింది. తన కేబినెట్ మంత్రులు వివాదాల్లో కూరుకుపోతున్నారు. దీంతో తీవ్ర విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు తాజాగా మున్సిపల్ ఉద్యోగుల నిరసన సెగ తగిలింది. ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నడిరోడ్డుపై బైఠాయించి కేజ్రీవాల్ సర్కారుకు నిరసన తెలిపారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మున్సిపల్ ఉద్యోగులు నేటి ఉదయం చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. అంతేకాక వారితో పాటే నడిరోడ్డుపై ఆయన బైఠాయించారు.