: 'డ్రీమ్ గాళ్' అమ్మమ్మ అయింది!
డ్రీమ్ గాళ్, బీజేపీ ఎంపీ హేమమాలిని అమ్మమ్మ అయింది. హేమ, ధర్మేంద్రల చిన్న కుమార్తె అహానా డియోల్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హేమ తన ట్విట్టర్ లో వెల్లడించింది. "శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. అహానా బేబీ బాయ్ కు జన్మనిచ్చింది. మేమంతా చాలా థ్రిల్డ్ గా ఉన్నాం! తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు" అని హేమ తెలిపింది. గతేడాది ఫిబ్రవరి 2న ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోహ్రాతో అహానా వివాహం జరిగింది.