: రాఘవేంద్రుడి హుండీలో సర్పరాజం... పరుగులు పెట్టిన భక్తులు


రాఘవేంద్రుడి సన్నిధిలోకి చొరబడ్డ ఓ సర్పరాజం అక్కడి భక్తులను పరుగులు పెట్టించింది. నేటి ఉదయం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేటి ఉదయం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఆలయంలోకి ఓ పాము ప్రవేశించింది. పామును చూసిన భక్తులు భయాందోళనలకు గురై పరుగులు పెట్టారు. భక్తుల అలికిడికి జడిసిన పాము దేవుడి హుండీలోకి వెళ్లిపోయింది. దీంతో వీఐపీ దర్శనాలను నిలిపివేసిన ఆలయ అధికారులు, హుండీలో కానుకలు వేయడాన్ని తాత్కాలికంగా నిలిపేశారు.

  • Loading...

More Telugu News