: ఏపీలో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో కౌన్సెలింగ్ ను ప్రారంభించారు. కౌన్సెలింగ్ కు హాజరవుతున్న విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తొలివిడతగా మొత్తం 34 సహాయ కేంద్రాల్లో సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. నిర్దేశిత ర్యాంకర్లు సంబంధిత సహాయ కేంద్రాలకు వెళ్లి సర్టిఫికేట్లను పరిశీలన చేయించుకోవచ్చు. ఏ ర్యాంకు వారైనా అన్ని సహాయ కేంద్రాలకు వెళ్లి తమ సర్టిఫికేట్ల నకళ్లను సమర్పించవచ్చని ఏపీ సాంకేతిక విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. ఈ రోజు మొదటివిడతగా తొలి ర్యాంకు నుంచి 15,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.