: ‘పాలమూరు’కు కిరణ్ హయాంలోనే అనుమతి... దేవినేని ఉమాకు హరీశ్ కౌంటర్!


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవన్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాదనను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తిప్పికొట్టారు. పాలమూరు ఎత్తిపోతలకు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే అనుమతులు వచ్చాయని హరీశ్ రావు చెప్పారు. డిండి ప్రాజెక్టుకు కూడా 2007లోనే డీపీఆర్ సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)ల ఆధారంగానే ముందుకుసాగుతున్నామని కూడా ఆయన చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా దేవినేని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News