: ఆమె సరదా కోసం మా నాన్న బలయ్యాడు: వాపోయిన ముంబైవాలా కుమార్తె


రెండు రోజుల క్రితం ముంబైలో రాంగ్ రూట్ లో కారును వేగంగా నడిపి, ట్యాక్సీని ఢీకొట్టి, ముగ్గురి మరణానికి కారణమైన మహిళా లాయర్ పై యూకేలో ఉంటున్న టాక్సీ డ్రైవర్ కుమార్తె విరుచుకుపడ్డారు. "ఆమె సరదా కోసం విస్కీ తాగింది, అందుకు మా నాన్న బలయ్యాడు" అని ఆమె వాపోయింది. తన తండ్రి 25 సంవత్సరాలుగా డ్రైవింగ్ చేస్తున్నాడని, ఏనాడూ, నిబంధనలు అతిక్రమించలేదని ఆమె చెప్పారు. ఎవరో రూల్స్ పాటించనందుకు అమాయకుడైన తన తండ్రి దూరమైనాడని అన్నారు. యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి తనకు నిద్రపట్టడం లేదని అన్నారు. ఆ మహిళా లాయర్ చేసిన పని హత్యతో సమానమని, చట్టానికి ఆమె సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. కాగా, యాక్సిడెంట్ సమయంలో ఆమె మోతాదుకు మూడు రెట్లు అధికంగా మద్యం సేవించి వుందని, రాంగ్ రూటులో 11 కిలోమీటర్ల దూరం వాహనాన్ని నడిపిందని పోలీసులు వెల్లడించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News