: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం...పైలట్ అప్రమత్తతతో తప్పిన ముప్పు
పెద్ద సంఖ్యలో ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే సమస్యను గుర్తించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ముప్పు తప్పింది. వివరాల్లోకెళితే... తిరుచ్చి నుంచి 170 మంది ప్రయాణికులతో కువైట్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అప్పటికే చాలా దూరం వెళ్లిన నేపథ్యంలో తిరుచ్చికి తిరిగివచ్చే అవకాశం లేదు. దీంతో వేగంగా స్పందించిన పైలట్ విమానాన్ని చెన్నై ఎయిర్ పోర్టులో సురక్షితంగా దింపేశాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.