: నాకు బాగా తెలుసు... అది బాబు గొంతే: కడియం


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడియో టేపుల వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఆ ఆడియో టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుదేనని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయం తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. తెలుగుదేశం పార్టీతో తనకు పాతికేళ్ల అనుభవం ఉందని, చంద్రబాబుతో ఎక్కువకాలం పనిచేశానని వివరించారు. ఇక, ఆడియో టేపుల్లో ఉన్నది ఎవరి గొంతో చెప్పకుండా, ఫోన్ ట్యాపింగ్ అంటూ చంద్రబాబు సమస్యను పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సర్కారు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని కడియం స్పష్టం చేశారు. తమ పాలనకు ఏడాది పూర్తయిందని, రాష్ట్రంలో ఆంధ్రులపై ఎక్కడా దాడి జరగలేదని అన్నారు. ఇక, అయ్యప్ప సొసైటీ ఆక్రమణల కూల్చివేత సందర్భంగా తెలంగాణ వ్యక్తుల భవనాలు కూడా కూల్చివేశారని తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో, ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన తన రాజీనామా పత్రాన్ని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై విషయాలు తెలిపారు.

  • Loading...

More Telugu News